నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ FMCG కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (HCCB), 25,000 కు పైగా యువతకు విక్రయాలు మరియు మార్కెటింగ్ శిక్షణకు సంబంధించి తమ బహుళ-రాష్ట్ర అప్‌స్కిల్లింగ్ కార్యక్రమంను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ మైలురాయి గత సంవత్సరం ఆగస్టులో యువత సాధికారత పట్ల HCCB ప్రకటించిన నిబద్ధతతో ప్రతిధ్వనిస్తూ, నైపుణ్యం-అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంచడంలో గణనీయమైన వేగాన్ని సూచిస్తుంది. Y4D ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు ఒడిశాతో సహా 8 భారతీయ రాష్ట్రాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఇటీవలి గ్రాడ్యుయేట్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి సంబంధిత ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన కాలేజ్ డ్రాప్ అవుట్స్ ను ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన యువత యొక్క విభిన్న అవసరాలు, ఆసక్తులు మరియు నైపుణ్య అవసరాలను తీర్చడానికి, ప్రభావవంతమైన అవగాహన సాధ్యం చేయడానికి ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు అవకాశాలు కల్పించటం మరియు పరిశ్రమ నిపుణుల నుండి మార్గదర్శకత్వంతో పాటు, ఉపాధిని సులభతరం చేయడానికి స్థానిక పరిశ్రమలు మరియు వ్యవస్థాపక అవకాశాలతో అభ్యాసకులను ఈ కార్యక్రమం కనెక్ట్ చేసింది. విక్రయాలు మరియు మార్కెటింగ్ కార్యక్రమం 30 గంటల కార్యక్రమం. ఇందులో 24 గంటల ఆన్‌లైన్ శిక్షణ మరియు 6 గంటల ముఖాముఖి పరస్పర చర్చ ఉన్నాయి. ఇది లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)పై హోస్ట్ చేయబడిన స్వీయ-గమన అభ్యాస కార్యక్రమం, దీనిని విద్యార్థి వారి సౌలభ్యం మేరకు సూచించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ప్రోడక్ట్ నాలెడ్జ్, సేల్స్ టెక్నిక్స్, మార్కెట్ రీసెర్చ్, ఎనాలిసిస్, సేల్స్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ బ్రాండింగ్, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ మరియు కెరీర్ గైడెన్స్‌లో నేర్చుకునేలా విద్యార్థులను ఈ ప్రోగ్రామ్ సన్నద్ధం చేస్తుంది. ఈ మైలురాయిని ప్రతిబింబిస్తూ, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్‌కి చెందిన చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ శ్రీ హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ , ” పలు రాష్ట్రాలలో 25,000 మంది యువతకు విక్రయాలు మరియు మార్కెటింగ్‌లో నైపుణ్యాన్ని పెంపొందించాలనే మా వ్యూహాత్మక కార్యక్రమానికి ఈ ప్రకటన ముగింపు. మన కమ్యూనిటీలలో అర్థవంతమైన సాధికారతను అందించాలనే మా నిరంతర నిబద్ధతలో ప్రధాన భాగం ఈ ప్రయత్నం . ఈ యువకులకు అవసరమైన విక్రయాలు మరియు మార్కెటింగ్ నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా మేము వారి ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచడం తో పాటుగా వారి ఆర్ధిక మరియు ప్రొఫెషనల్ అభివృద్ధి కి సైతం చురుగ్గా తోడ్పడుతున్నాము. మా కార్పొరేట్ విలువలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉండటం తో పాటుగా మరింత అభివృద్ధి చెందిన ఇండియా కోసం జాతీయ లక్ష్యాలతో ప్రతిధ్వనిస్తుంది” అని అన్నారు. “ఈ ఉపాధి-కేంద్రీకృత కార్యక్రమానికి మద్దతునిచ్చినందుకు మరియు వారి నైపుణ్యాభివృద్ధి కోర్సులలో చేర్చినందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఉదాహరణకు, అవగాహన ఒప్పందాలలో భాగంగా, మేము తమిళనాడులోని నాన్ ముధల్వన్ పథకం, కౌశల్య, గుజరాత్‌లోని ది స్కిల్ యూనివర్సిటీ మరియు తెలంగాణలోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌తో భాగస్వామ్యం చేసుకున్నాము. మేము ఈ మైలురాయిని చేరుకున్నప్పుడు, మా దృష్టి సాంఘిక-ఆర్థిక సాధికారత కార్యక్రమాలలో తదుపరి పెట్టుబడుల వైపు మళ్లుతుంది, మేము సమగ్రమైన మరియు ప్రభావవంతమైన అవకాశాలను అందించడాన్ని కొనసాగిస్తాము, ”అన్నారాయన. “మహారాష్ట్ర నుండి ప్రోగ్రామ్ యొక్క లబ్ధిదారులలో ఒకరైన శ్రీమతి దిపాలి సలుంఖే మాట్లాడుతూ, “నేను HCCB యొక్క సేల్స్ మరియు మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నప్పుడు, అది నా వృత్తిపరమైన ప్రయాణాన్ని మార్చివేసింది. ఈ ప్రోగ్రామ్‌కు ముందు, ఆతిథ్య రంగంలో పనిచేసినప్పుడు, నేను , నా పరిశ్రమలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు కస్టమర్ సంబంధాల యొక్క ప్రాముఖ్యత ను తక్కువ అంచనా వేసాను. అయితే, ఈ కార్యక్రమం ఈ భావనను సమూలంగా మార్చింది. మరీముఖ్యంగా నేను ఈ రంగాలలో విలువైన పరిజ్ఞానం మరియు ఆచరణాత్మక నైపుణ్యాలను పొందినప్పుడు ఇది మరింతగా మారింది. ఈ శిక్షణా కార్యక్రమాలలో నేర్చుకున్న అభ్యాసాలను అమలు చేసినప్పుడు, నేను కస్టమర్‌లు మరియు సహోద్యోగులుతో చేసే సంభాషణల పరంగా గణనీయమైన అభివృద్ధి గమనించాను . ఈ ప్రోగ్రామ్ కారణంగానే అది సాధ్యమైనది. నేను నా విధులను మరింత నమ్మకంగా మరియు సమర్థంగా పోషిస్తున్నాను మరియు అవసరమైన నైపుణ్యాలతో సాధికారత పొందాను…” అని అన్నారు. గుజరాత్‌కు చెందిన మరో లబ్ధిదారుడు, శ్రీ చింటూ ఘెవరం ప్రజాపతి మాట్లాడుతూ, “నేను నా కుటుంబం యొక్క ఆప్టికల్ వ్యాపారాన్ని సాంప్రదాయ పద్ధతిలో నడుపుతున్నాను. అది పెద్దగా లాభ సాటిగా లేకపోయింది. సేల్స్ మరియు మార్కెటింగ్ శిక్షణ కార్యక్రమం తర్వాత, విషయాలు గణనీయంగా మారాయి. ఇప్పుడు, నేను మా ఉత్పత్తులను విక్రయించడానికి కొత్త మరియు స్మార్ట్ మార్గాలపై దృష్టి పెడుతున్నాను . కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం, ఉత్పత్తి దృశ్యమానతను పెంచడం మరియు కస్టమర్‌లను ఆసక్తిగా ఉంచడం నేర్చుకున్నాను. ఇది మా కస్టమర్ల బేస్ పెంచడానికి మరియు వారి విధేయతను పొందేందుకు సహాయపడింది. ప్రోగ్రామ్ తర్వాత నేను డిజిటల్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియాను ఉపయోగించడం ప్రారంభించాను, ఇది మార్కెట్‌లో మా వ్యాపారాన్ని బలోపేతం చేసింది…” అని అన్నారు. సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే ఛాంపియన్ కార్యక్రమాలకు HCCB కట్టుబడి ఉంది. 25,000 మంది యువతకు సాధికారత కల్పించడంలో గణనీయమైన విజయంతో పాటు, సంస్థ 25,000 మంది మహిళలకు డిజిటల్ మరియు ఆర్థిక అక్షరాస్యత శిక్షణను అందించింది మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కింద విద్యార్థుల కోసం ‘క్యాంపస్ టు కార్పోరేట్’ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతోంది. హెచ్‌సిసిబి చేపట్టిన కమ్యూనిటీ కార్యక్రమాలు 7,50,000 మంది వ్యక్తులకు పలు రాష్ట్రాల్లో సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించే వాటర్ ఎటిఎంలు మరియు ఆర్‌ఓ యూనిట్లు, డిజిటల్ అభ్యాసం ను సాధ్యం చేసేలా స్థానిక పాఠశాలల్లో స్మార్ట్‌బోర్డ్‌లతో కూడిన తరగతి గదులు, రైతులు కు సుస్థిర వ్యవసాయ అభ్యాసాల శిక్షణ మరియు మరియు ఇతర వృత్తి శిక్షణలతో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదలల తో ప్రయోజనం పొందారు.