హిరోషిమా ఓ చేదు జ్ఞాపకం

Hiroshima is a bitter memoryహిరోషిమా, నాగసాకిలపై విధ్వంసం సృష్టించిన ఈ అణుబాంబులను తయారు చేసినవారిలో ప్రధాన శాస్త్రవేత్త అయిన జూలియస్‌ రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్కిలీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడు. యుద్దకాలంలో లాస్‌అలమోస్‌ పరిశోధనాశాలకు అధ్యక్షుడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అణుబాంబులను తయారు చేసే మన్‌హట్టన్‌ ప్రెక్టులో అతని విశేష సేవకు గుర్తుగా ”అణుబాంబు పితామహుడు” అని బిరుదు ఇచ్చారు. ఈయన నాయకత్వంలో చేసిన బాంబులే హిరోషిమా, నాగసాకీలను ధ్వంసం చేసాయి. హిరోషిమాపై ‘లిటిల్‌బారు’ విసిరేయగానే అతను తనలో తాను ప్రపంచంలో ‘ప్రతిస్పందన ప్రారంభమైంది’ అన్నాడు
అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం. ఆగస్ట్‌. 6, 1945. ఉదయం గం.8ల 15ని.లు. జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా 29 సూపర్‌ఫోర్ట్రెస్‌ ఎనోలా గే ‘లిటిల్‌ బారు’ అనే యూరేనియం గన్‌ వంటి అణు బాంబు ధడేల్‌మన్నది. నిమిషాల్లో 70,000 నుండి 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే హిరోషిమా జనాభాలో 30% మంది అక్కడికక్కడే మరణించారు. మరో 70,000 మంది గాయపడ్డారు. సుమారు 20,000 మంది జపాను సైనికులు మరణించారు. 12 చ.కి.మీ. నగరం ధ్వంసమైందని అమెరికా అంచనా వేసింది. జపాను అధికారుల అంచనా ప్రకారం హిరోషిమాలోని భవనాల్లో 69% ధ్వంసం కాగా, మరో 6 నుండి 7% దెబ్బతిన్నాయి.
మూడు రోజుల తరువాత అంటే ఆగస్ట్‌ 9న అదే తరహాలో నాగసాకి నగరంపై ‘ఫ్యాట్‌ మ్యాన్‌’ అనే బాంబును పేల్చారు. ఈ దాడిలో 40వేల మంది అప్పటికప్పుడే ప్రాణాలొదిలారు. దాదాపు అరవై వేలకు పైగా గాయపడ్డారు. ఐదు రోజుల తర్వాత ఇంపీరియల్‌ జపాన్‌ అమెరికాకు లొంగిపోక తప్పలేదు. ఈ ఘటనతో ఆగస్టు 15, 1945న రెండవ ప్రపంచ యుద్ధం సమాప్తికి నాంది పలికింది.
హిరోషిమా, నాగసాకిలపై అణు బాంబు దాడిలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఆగస్టు 6న అమెరికాలోని కొంతమంది తప్ప యావత్‌ ప్రపంచం ”హిరోషిమా మెమోరియలో డే” జరుపుకుంటోంది.
ఈ ఘట్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే… పేలుడు తరువాత ఎక్కువ మంటలు రేగాయి. కాగితం మరియు కలపతో చేసిన ఇళ్ళ ద్వారా ఈ మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు 2 కి.మీ. వ్యాసార్థంలోని ప్రదేశాన్ని భస్మీపటలం చేసాయి. క్షేత్రస్థాయిలో అంత నష్టం చేకూరగా; సిమెంట్‌ మరియు కాంక్రీటు భవనాల్లో కొన్నింటిని భూకంపాలను తట్టుకునేందుకు గాను బాగా బలంగా నిర్మించారు. అవి పేలుడు ప్రదేశానికి దగ్గరగా ఉన్న కూడా పేలుడు ధాటికి దెబ్బతినకుండా తట్టుకున్నాయి. వాటి ఫ్రేమ్‌వర్కు దెబ్బతినలేదు. బాంబు భూమి నుండి కొంత ఎత్తులో, గాలిలో పేలడం వలన పేలుడు ఇరు ప్రక్కల కంటే కింది వైపుకు కేంద్రీకతమైంది. ఆ కారణంగానే పేలుడు ప్రదేశానికి 150 మీ. దూరంలో ఉన్న జెన్‌బాకు డోమ్‌ నాశనం కాకుండా తట్టుకోగలిగింది. అప్పటినుండి ఆ భవనాన్ని హిరోషిమా శాంతి స్మారకంగా పిలుస్తున్నారు. 1996 లో దీన్ని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.
నాగసాకిపై వేసిన బాంబు, హిరోషిమా బాంబు కంటే శక్తివంతమైన దైనప్పటికీ, కొండల కారణంగా దాని ప్రభావం ఉరకామి లోయకే పరిమితమైంది. మిట్సుబిషి ఆయుధ కర్మాగారంలో పని చేసే 7,500 మందిలో 6,200 మంది మరణించారు. ఇతర ఆయుధ కర్మాగారాల్లో పనిచేసే వారు కూడా 17,000 నుండి 22,000 మంది దాకా మరణింఛారు. తక్షణమే మరణించిన వారి సంఖ్య 22,000 నుండి 75,000 దాకా ఉండవచ్చని వివిధ అంచనాలు ఉన్నాయి. విస్ఫోటనం తరువాత కొన్ని నెలల్లో గాయాలపాలైన వారు అనేక మంది మరణించారు. సరైన దస్త్రాలు లేకుండా పని చేస్తున్న విదేశీ కార్మికులు నగరంలో ఉండటం, వచ్చి పోయే సైనికులు అనేక మంది ఉండటం వంటి కారణాల వలన మరణాల లెక్క ఇప్పటికీ సరిగ్గా తేలలేదు. వివిధ అధ్యయనాల్లో 39,000 నుండి 80,000 దాకా వివిధ అంచనాలు వెలువడ్డాయి.
***
ఇక్కడ మానవ పైశాచికత్వం ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయొచ్చు… జపాన్‌లోని హిరోషిమాపై ఆగష్టు 6, 1945న జరిగిన దాడి గురించిన సమాచారం అందగానే; బాంబు తయారు చేసిన యునైటెడ్‌ స్టేట్స్‌లోని ”లాస్‌ అలమోస్‌ నేషనల్‌ లాబొరేటరీ”లోని భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ బేస్‌ థియేటర్‌లో గర్జిస్తూ, సంతోషం ఎగబాకి భూమిని పాదాలతో గట్టిగా తంతూ జపాన్‌ (హిరోషిమా) విధ్వంసాన్ని స్వాగతం పలికారు. ఆటమ్‌బాంబ్‌ను రూపొందించడంలో ఇతరులకన్నా ఎక్కువ కషి చేసిన వ్యక్తి బాక్సింగ్‌ ఛాంపియన్‌లా తలపై చేతులు కట్టుకుని ప్రతిస్పందించాడు. కొన్ని జంటలు నత్యం చేస్తూ వేడుకలు చేసుకున్నాయి. మరికొందరు ఎలాంటి అనుభూతి చెందాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయారు. వైన్స్‌ త్రాగుతూ కాసేపట్లో గుసగుసలు మొదలయ్యాయి.
ఒక మూలలో కూర్చుని ఉన్న ఓపెన్‌హైమర్‌ వాషింగ్టన్‌ నుండి మొదటి డ్యామేజ్‌ రిపోర్ట్‌తో వచ్చిన టెలెక్స్‌ గురించి చర్చించాడు. హిరోషిమా, నాగసాకిలపై విధ్వంసం సృష్టించిన ఈ అణుబాంబులను తయారు చేసినవారిలో ప్రధాన శాస్త్రవేత్త అయిన జూలియస్‌ రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్కిలీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడు. యుద్దకాలంలో లాస్‌అలమోస్‌ పరిశోధనాశాలకు అధ్యక్షుడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అణుబాంబులను తయారు చేసే మన్‌హట్టన్‌ ప్రెక్టులో అతని విశేష సేవకు గుర్తుగా ”అణుబాంబు పితామహుడు” అని బిరుదు ఇచ్చారు. ఈయన నాయకత్వంలో చేసిన బాంబులే హిరోషిమా, నాగసాకీలను ధ్వంసం చేసాయి. హిరోషిమాపై ‘లిటిల్‌బారు’ విసిరేయగానే అతను తనలో తాను ప్రపంచంలో ‘ప్రతిస్పందన ప్రారంభమైంది’ అన్నాడు. (శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి అనుకున్నది సాధించడం ఒక ఎత్తు. ఆ ప్రయోగం వల్ల ఫలితాలు సాధించడం కంటే నష్టమే ఎక్కువ జరిగితే… అయినా ఆనందోత్సాహాలతో కేకలేస్తూ, నృత్యాలు చేస్తూ పండుగ పార్టీలు చేసుకుంటే మానవుడెవడో? హైవానుడెవడో?!… అర్దంకాని పరిస్థితి. కానీ; ఇక్కడ వారు ఆశించిన ఫలితం అదే. ఇతరులకు నష్టం చేయడం వారి ప్రధాన ఆశయం. అనుకున్నదానికంటే ఎక్కువ నష్టం చేయగలిగాం అనే ఆనందోత్సాహం. ఎంత పరాకాష్ట?! అంటే వారు చేసిన ప్రయోగాలు ఫలించాయని ఆ వేడుకలు చేసుకుని ఉంటారు కాబోలు.)
చాలా మంది అమెరికన్లు జపాన్‌పై రెండు అణు బాంబులు వేయడాన్ని ఆమోదించారు. కొందరు తమ దేశాన్ని అసహించుకున్నారు. ద్వేశించుకున్నారు. అంటే బాంబులు వేయడం తప్పు కదా! అని అభిప్రాయ పడ్డారు. అప్పటికైనా యుద్దం ముగిసినందుకు కతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఆగష్టు 31, 1946న, జపాన్‌ లొంగిపోయిన ఒక సంవత్సరం తరువాత యుద్ధానికి సంబందించిన వార్తలు కవర్‌ చేసే అమెరికా మిడియా ప్రత్యేక ప్రతినిధి జాన్‌ హెర్సే హిరోషిమాపై బాంబు పడిన రోజు గురించి రాసిన కథనాలన్నీ ఒక సంచిక రూపంలో ప్రచురించారు. కేవలం అతిప్రధానమైన వాస్తవాలను మాత్రమే ఆ సంచికలో పొందుపరచాడు జాన్‌హెర్సే. కథనాలు చాలా తక్కువ సమయంలో ఎక్కువగా ఆలోచింపచేసే విధంగా ఆగుతూ ఆగుతూ గంట గంటకి, నిమిష నిమిషానికి మధ్య అత్యంత భారాన్ని మోస్తున్నట్టు ఉన్నాయి. ఆందులో అత్యంత ప్రాధాన్యతను చూరగొన్న కథనం; బాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన ఆరుగురి కథ. వివరాల్లోకెళ్ళితే చాలా భయంకరమైన విషయాలు ప్రస్పుటమవుతున్నాయి. చాలా మంది పాఠకులకు రేడియేషన్‌ పాయిజనింగ్‌ యొక్క భయంకరమైన ప్రభావాలను హెర్సే మొదటిసారిగా వివరించాడు… ఆ సంచికలో ”హిరోషిమా” అనే శీర్షికతో వచ్చిన వ్యాసం తక్షణ సంచలనాన్ని కలిగించింది. రేడియో అనౌన్సర్లు గాలిలో మొత్తం 30,000 పదాలను బిగ్గరగా ఏకధాటిగా దిగమింగకుండా చదివారు. సంపాదకీయ రచయితలు పూర్తి కథనాన్ని పొందవలసిందిగా పాఠకులను కోరారు. మరియు ప్రిన్స్‌టన్‌, న్యూజెర్సీలో పట్టణ మేయర్‌ స్థానిక నివాసులను కూడా అదే విధంగా చేయమని కోరారు. 1000 కాపీలను ఆర్డర్‌ చేశాడు…
ఇలాంటి ప్రాధాన్యతను గుర్తిస్తూ నేడు అనేక దేశాలలో యుద్ధ వ్యతిరేక మరియు అణు వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో హిరోషిమా దినోత్సవం ప్రధానాంశమైంది. హిరోషిమా దినోత్సవం రాజకీయాల్లో శాంతిని సూచిస్తుంది మరియు ఈ రోజున ప్రజలు ‘హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ మ్యూజియా’న్ని సందర్శిస్తారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా మరియు నాగసాకిపై అణు బాంబు దాడిని ఆర్కైవ్‌ (పురావస్తు) అంశంగా పరిగణించవచ్చు.
– మహేష్‌ దుర్గే , 8333987858