ఓ యుద్ధం మిగిల్చిన గాయం-హిరోషిమా

A wound left by war-Hiroshimaరెండవ ప్రపంచ యుద్ధం గురించి అందరూ వినే ఉంటారు. 30 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న అతిపెద్ద యుద్ధమిది. పోలాండ్‌పై 1939 నాజీ దండయాత్రతో చెలరేగిన యుద్ధం 1945లో నాజీ జర్మనీ, జపాన్‌, ఇటలీ అక్ష శక్తులను, మిత్రరాజ్యాలు ఓడించే వరకు ఆరు రక్తపాత సంవత్సరాల పాటు సాగిన సంగ్రామం. చివరకు జపాన్‌పై అమెరికా రెండు అణు బాంబులు వేయడం ద్వారా ఈ యుద్ధం ముగిసింది. ఇది మానవాళి చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది జపాన్‌. ప్రజలు వేల సంఖ్యలో మరణించారు. జపాన్‌ ఆసియాలో తన సామ్రాజ్యాన్ని విస్తరిం చడం అమెరికా సహించలేక పోయింది. తనకంటే ఎక్కువ శక్తిగల దేశంగా జపాన్‌ బలపడిపోతుందేమోనన్న ఆందోళన, భయం అమెరికాకు ఉంది. జపాన్‌తో ప్రత్యక్షంగా యుద్ధం చేయాలని లోపల కోరికున్నప్పటికీ అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ మరొక దేశంతో యుద్ధం తనంతట తానుగా ప్రారంభించదని తన దేశాల ప్రజలకు వాగ్దానం చేశాడు. జపానే తనంతట తానుగా అమెరికాపై దాడిచేస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో జపానుపై సమరం చేయవలసి వచ్చిందని తన ప్రజలకు నమ్మించగలమనే ఒక దురాలోచనతో మంచి సమయం కోసం ఎదురు చూశాడు. అప్పట్లో జపాన్‌ తన చమురు అవ సరాలకు ఎక్కువగా అమెరికాపై ఆధారపడింది. దీనిని రూజ్‌వెల్ట్‌ తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. జపాన్‌పై చమురు నిషేధాన్ని విధించాడు. చమురు నిషేధంపై జపాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు దీనిని యుద్ధ చర్యగా భావించారు. వారు 7 డిసెంబర్‌ 1941న పెర్ల్‌ నౌకా శ్రయంపై ఆకస్మికదాడిని ప్రారంభించడం ద్వారా ప్రతిస్పందిం చారు. ఈ దాడి యునైటెడ్‌ స్టేట్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి తీసుకువచ్చింది.1945లో జపాన్‌ను ఎలాగైనా ఓడించాలని యుధ్ధంలో భాగంగా అమెరికా జపాన్‌పై అణు బాంబులను ప్రయోగించింది. లిటిల్‌బారుగా పేరు పెట్టబడిన మొదటి అణుబాంబును6 ఆగస్ట్‌ 1945లో హిరోషిమాపై పడేసింది. అప్పటి నుండి ఈ తేదీని హిరోషిమా దినంగా పిలుస్తున్నారు. అణు పరమాణు శక్తులను మానవాళి శాంతి సంక్షే మాలకు మాత్రమే వాడాలని, విధ్వంసం కోసం దుర్వినియోగం చేయవద్దంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ రోజున హిరోషిమా నరగంలోని ‘శాంతి వనం’లో ప్రధాన కార్యక్ర మం నిర్వహిస్తారు. నాటి ఆటమ్‌ బాంబు దెబ్బకు నేటికీ కోలుకోని జపనీయులు శాంతియుత మార్గాల్లో అభివద్ధి దిశగా పయనించడం, అగ్రరాజ్యంగా నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి అణుయుద్ధ్ధాలు జరగకుండా ప్రపంచదేశాలన్నీ ఒక ఒడంబడికకు రావాలి. ఐక్య రాజ్య సమితి దేశాల్లో ఉన్న వైర్యాన్ని తగ్గించేందుకు శాంతిని ప్రబోధించాలి. సమస్యలుంటే పరస్పర అవగాహనతో సంప్ర దింపులు చేసి పరిష్కరించుకోవాలి. ఎందు కంటే జపాన్‌లో జరిగిన ప్రాణనష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. అమెరికా విషకౌగిలిలో బంధీ కావడానికి ఉవ్విళ్లూరు తున్న భారత్‌కు ఈ విషయం తెలిసి రావాలి.పరిస్థితులను అంచనా వేస్తూ సొంతంగా నిలబడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి. సామ్రాజ్యవాద దేశాలతో దోస్తీ ప్రజాస్వామ్యదేశమైనా భారత్‌కు మంచిది కాదనే విషయం ఆలోచించాలి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలో మరణించిన పౌరులకు నివాళి. (06 ఆగష్టు ‘హిరోషిమా దినం’)
– డిజె. మోహన రావు, 9440485824