తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు..

His land was taken illegally.– కలెక్టర్ న్యాయం చేయాలంటూ ఇద్దరు పిల్లలతో దీక్ష 
నవతెలంగాణ – బాన్సువాడ / నసూరుల్లాబాద్
తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ, ఇద్దరు పిల్లలతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన ఓ మహిళ.  భూమికి వారసులు ఉండంగా కూడా కొంతమంది ఎవరూ లేరు అంటూ తప్పుడు రికార్డు చూపి భూమిని అక్రముగా పట్టా చేసుకొని భూమిని అనుభవిస్తున్నారని ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి  బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ప్రధాన గేటు  ముందు దీక్షకు దిగారు.  వివరాలు ఇలా ఉన్నాయి.  జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన పూజ , ఆమె తల్లిదండ్రులకు చెందిన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకుని అనుభవిస్తున్నాడని ఆమె సోమవారం దీక్షకు కూర్చున్నారు. చిన్నప్పుడే  తండ్రి మృతి చెందగా 2018లో తల్లి కూడా చనిపోయింది.  తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వారసురాలైన పూజ పేరు మీద రెవెన్యూ అధికారులు చేయవలసి ఉండగా, పూజ ఆ సమయంలో మైనర్ ఉండడం వల్ల ఎకరం మూడు గుంటల భూమిని పట్టా చేసే అధికారం లేదన్నారు. అలాగే గ్రామాల్లో ఒక వ్యక్తితో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఆ భూమిని ఒక వ్యక్తి పేరు మీద పట్టా
మార్పిడి చేశారు . ఇప్పుడు ఆ భూమి ఇవ్వాలని పూజ అధికారులకు మొరపట్టుకున్నప్పటికీ అధికారులు కరుణించకపోవటంతో న్యాయం కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం మెట్లు ఎక్కవలసన పరిస్థితి తీసుకువచ్చారు  జుక్కల్ రెవెన్యూ అధికారులు. ఇద్దరు పిల్లలతో పూజ బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బయట నుంచి ఒకరోజు దీక్షకు కూర్చున్నారు. తన సమస్యలు చెప్పుకోవడానికి వస్తే సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడం నిరాశగా వెళ్లిపోయింది. తన భూమి తనకు వారు రోజుల్లో తన పేరు మీద పట్టా కాకుంటే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ దీక్షకు పూకుంటానని పూజ తెలిపింది. ఈ విషయంపై జూకల్  తహశీల్దార్ హిమబిందును వివరణ కోరగా తన వద్దకు ఎవరూ రాలేదని, వస్తే పూర్తి వివరాలు విచారించి న్యాయం చేస్తానని తాహశీల్దార్ తెలిపారు.