
నవతెలంగాణ- కంటేశ్వర్
ప్రజా, సాహిత్య యుద్ద నౌక గద్దర్ మృతి యావత్ తెలుగు, సాహిత్య సమాజానికి తీరనిలోటు. తన ఆట, పాటలతో తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలను నడిపిన చరిత్రకారుడిగా ఆయన నిలిచిపోతారు. వామపక్షవాదిగా సామాన్య ప్రజల పక్షాన గద్దర్ పోరాటం అసమానం. ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకరిగా, జన చైతన్యానికి నిర్విరామ కృషి చేశారు. బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి, పొడుస్తున్న పొద్దు మీద, జై బోలో తెలంగాణ అంటూ గద్దర్ రాసి, పాడిన పాటలను ఎవరు మరిచిపోలేరు. ఈ పాటల రూపంలో ఆయన అమరుడిగానే ఉంటారు. పుస్తక పాఠ్యాంశాల్లో గద్దర్ చరిత్రకు స్థానం కల్పించాలి. అత్యున్నత పురస్కారాలతో ఆయనను గౌరవించాలి. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. అయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను.