మ‌రోసారి చ‌రిత్ర సృష్టించింది

అమృత్‌సర్‌లోని గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రికార్డులు బద్దలు కొట్టడం ఆమెకు కొత్త కాదు. తన చరిత్రను తానే లిఖించుకోవడంలో ఆమెకు ఆమే సాటి. ఐదేండ్ల కిందటనే కఠిన పరీక్షల్లో నెగ్గి భారత తొలి యుద్ధ విమాన పైలట్‌(ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌)గా చరిత్ర సృష్టించారు. అత్యాధునిక యుద్ధ విమానాలను నడిపేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఇప్పుడు తరంగ్‌ శక్తిలో భాగమై తన రికార్డును తానే బద్దలు కొట్టారు. భారత వాయుసేనలో వాయువేగంతో దూసుకుపోతున్నారు. ఆమే ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ మోహనా సింగ్‌.
రాజస్తాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో మోహనా సింగ్‌ జన్మించారు. అమృత్‌సర్‌లోని గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. మోహన తండ్రి ప్రతాప్‌ సింగ్‌ వాయుసేనలోనే వారంట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. తాత లాడూ రామ్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఫ్లైట్‌ గన్నర్‌. ఈయన 1948 భారత్‌-పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్‌ చక్ర అవార్డు కూడా పొందారు. 2016లో ప్రభుత్వం మహిళలకు కూడా యుద్ధ విమానాలు నడిపే అవకాశం ఇచ్చింది. దాంతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో దాదాపు 20 మంది మహిళా ఫైటర్‌ పైలట్లు చేరారు. అందులో మోహన కూడా ఒకరు. ఈమె తండ్రి విధులు నిర్వర్తిస్తున్న చోటే ట్రెయినీ క్యాండెట్‌గా చేరి 2019లో శిక్షణ పూర్తి చేశారు.
కఠినమైన శిక్షణతో
జెట్‌ ఫైటర్‌గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తి చేయాలి. సుమారు పన్నెండు సార్లు ద్వంద్వ తనఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్‌, లాండింగ్‌ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్ని మళ్లించే చతురత ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. అలాంటి కఠినమైన శిక్షణలో మోహనతో పాటు భావనా కాంత్‌, అవనీ చతుర్వేది కూడా విజయం సాధించారు.
తొలి మహిళగా…
బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో శిక్షణ ముగిసిన కొన్ని రోజుల్లోనే మోహనా అరుదైన ఘనత సాధించారు. అత్యాధునిక యుద్ధ విమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని ఆమె పూర్తి చేశారు. అప్పటికే మోహనకు 500 గంటలకు పైగా ఫ్లయింగ్‌ అనుభవం ఉంది. ఇందులో 380 గంటలు హాక్‌ ఎంకే-132 జెట్‌ను నడిపారు.
‘తరంగ్‌ శక్తి’లో…
తాజాగాLCA తేజస్‌ ఫైటర్‌ ఫ్లీట్‌లో మోహనా సింగ్‌ మరోసారి మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా నిలిచారు. అంతేకాదు ఎలైట్‌ 18 ‘ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌’ స్క్వాడ్రన్‌లో చేరిన మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’LCA తేజస్‌ ఫైటర్‌ జెట్‌ స్క్వాడ్రన్‌ను నిర్వహిస్తోంది. మోహనా సింగ్‌ ఇందులో చేరి లింగ సమానత్వం, సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. మరింత మంది మహిళలు వాయుసేనలో చేరేందుకు మార్గం సుగమం చేశారు. త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు వైస్‌ చీఫ్‌ల చారిత్రాత్మక విమానంలో భాగమయ్యారు. జోధ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ‘తరంగ్‌ శక్తి’లో అధికారికంగా పాల్గొన్నారు.
చారిత్రాత్మక ఫ్లైట్‌LCA
మోహనా సింగ్‌తో పాటు శిక్షణ పొందిన ఇతర ఇద్దరు మహిళలు భావా కాంత్‌, అవనీ చతుర్వేది ప్రస్తుతం పశ్చిమ ఎడారిలో Su-30 MKI ఫైటర్‌ జెట్‌లను నడుపుతున్నారు. మొన్నటి వరకు మోహన MiG-21 కోసం పని చేశారు. ప్రస్తుతం చారిత్రాత్మక ఫ్లైట్‌LCA తేజస్‌ ఫైటర్‌ జెట్‌లో ఆర్మీ, నేవీ వైస్‌ చీఫ్‌లకు సూచనలతో పాటు వారికి అవసరమైన సహాయం అందిస్తున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాకు, రక్షణ దళాలు ఉమ్మడి పద్ధతిలో మద్దతు ఇవ్వడానికి ఇది ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. యూఎస్‌, గ్రీస్‌, శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు అనేక ఇతర దేశాలతో సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి వైమానిక దళాలు తమ ఫైటర్‌ జెట్‌లతో జోధ్‌పూర్‌ ఎయిర్‌లో ఎక్సర్‌సైజ్‌కు హాజరయ్యారు. ఇందులో మన LCA తేజస్‌లో విమానం కూడా పాలుపంచుకుంది.