– ఘనంగా ఇంజనీరింగ్ డే వేడుకలు
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
చరిత్ర నిర్మాణం కావాలంటే అది ఇంజనీర్లతోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా జిల్లా ఇంజనీర్లు ఎదగాలని బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదివారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకోని అర్కెటిక్ట్స్ ఇంజనీర్స్ అండ్ ఎల్టీపీఎస్ అసొసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డేను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఓఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ వేడుకలను మాజీ ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వందేమాతర గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఇటీవల జడ్పీ డీఈ రఫతుల్లా మరణించిన నేపథ్యంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ ప్రపంచలోనే అతిపెద్ద ప్రాజెక్టులను తయారు చేసిన మహానీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. హైదరాబాద్ లో మూసి నది వల్ల వరదలు వచ్చి నష్టం మిగిలిస్తున్న సమయంలో ఆయన సూచనల మేరకు ఎన్నో బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. సమాజంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, కాలానికి అనుగుణంగా పెద్ద ప్రాజెక్టులను చేస్తు ఇంజనీర్లు సమాజంలో వారి పాత్రను పోశిస్తున్నారని కొనియాడారు. జిల్లాలోని ఇంజనీర్లు కూడా మోక్షగుండంను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, అర్కెటిక్ట్ ఇంజనీర్స్ అండ్ ఎల్టీపీఎస్ అసొసియేషన్ జిల్లా అద్యక్షుడు అన్నదానం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి అడప యోగేశ్వర్, సయ్యద్ సాబిర్ అలీ, కొమ్మవార్ వేదాంత్, వికాస్, రాణి ఉన్నారు.