– బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎంపీ అభ్యర్థి నామ, మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ- ఖమ్మం
బీఆర్‌ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు శనివారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏవిధంగానైతే అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి చరిత్ర తిరగరాశారో అదే విధంగా కెసిఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ చరిత్రను తిరగరాస్తుందని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాను మొదటి ఓటు వేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి కష్టం వల్లే తెలంగాణ సాధించుకుని రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను చరిత్ర ఉన్నంతకాలం గుర్తుంచు కుంటారని, ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణను కాపాడుకోవాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఇంటింటికి వెళ్లి తనను గెలిపించి కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, బచ్చు విజయకుమార్, ఆర్జేసీ కృష్ణ, నాగరాజు బిచ్చాల తిరుమలరావు, ఉప్పల వెంకటరమణ, తాజుద్దీన్, బొమ్మెర రామ్మూర్తి సుబ్బారావు పాల్గొన్నారు.
నామాను అత్యధిక
మెజారిటీతో గెలిపించాలి: జెడ్పీ ఛైర్మెన్ లింగాల కమల్‌రాజు
ఎర్రుపాలెం: త్వరలో జరగనున్న పార్లమెంటు సాధారణ ఎన్నికలలో బిఆర్‌ఎస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎర్రుపాలెం మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బూత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమల్ రాజు మాట్లాడుతూ గ్రామాలలో పార్టీ బలోపేతానికి నాయకులు. కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, జడ్పిటిసి శీలం కవిత, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, వైస్ ఎంపీపీ రామకోటయ్య, మహిళా అధ్యక్షురాలు శిరీష, ఎంపీటీసీ సభ్యులు. మాజీ గ్రామపంచాయతీ సర్పంచులు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.