మైక్రోసాఫ్ట్‌ దెబ్బకు..

– ఇండిగోకు భారీ నష్టం
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌లో అంతరాయం చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగోకు భారీ నష్టాలను మిగిల్చింది. శుక్రవారం ఒక్క రోజే దాదాపు 200 విమాన సేవలను రద్దు చేసింది. మైక్రోసాఫ్ట్‌ ఔటేజ్‌ ఎఫెక్ట్‌ ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు దాదాపు రూ.5300 కోట్ల నష్టం వాటిల్లింది. శుక్రవారం ఇండిగో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి.