హిటాచీకి 56 ఎలివేటర్లు, ఎస్కలేటర్‌ల ఆర్డర్‌

హైదరాబాద్: భారతదేశంలో ఎలివేటర్లు, ఎస్కలేటర్‌ల విక్రయాలు, ఇన్‌స్టాలేషన్ మరియు నిర్వహణ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న హిటాచీ లిమిటెడ్. (TSE: 6501; ఇకపై హిటాచీగా సంబోధిస్తాము) యొక్క అనుబంధ సంస్థ, హిటాచీ బిల్డింగ్ సిస్టమ్స్ కో. లిమిటెడ్ (ఇకపై హిటాచీ బిల్డింగ్ సిస్టమ్స్ గా సంబోధిస్తాము). హిటాచీ లిఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇకపై హిటాచీ లిఫ్ట్ ఇండియా గా సంబోధిస్తాము), భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో వున్న CRC ది ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్ కోసం CRC గ్రూప్ నుండి 56 యూనిట్ల ఎలివేటర్లు మరియు ఎస్కలేటర్‌ల కోసం విజయవంతంగా ఆర్డర్‌ను పొందినట్లు  ఈరోజు హిటాచీ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ నోయిడాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ప్రాజెక్టులలో ఒకటి.

ఈ ఆర్డర్‌లో 180  లేదా  150 మీ/నిమి  వేగంతో కూడిన  హై-స్పీడ్ ఎలివేటర్లు సహా  44 ఎలివేటర్‌లు మరియు 12 ఎస్కలేటర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఎలివేటర్ కార్లను సమర్ధవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చే డెస్టినేషన్ ఫ్లోర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా భాగంగా వుంది. ఈ ఎలివేటర్‌లలో భూకంప సమయాలలో పనిచేసే అత్యవసర నిర్వహణ వ్యవస్థ కూడా ఉంది, ఇది భూకంపాన్ని గుర్తించి, ఎలివేటర్‌ను దగ్గరగా ఉన్న అంతస్తులో వెంటనే  ఆపివేస్తుంది, తద్వారా ప్రయాణికులు అందులో చిక్కుకోకుండా బయటికి రావచ్చు. ఈ ఫీచర్లు వినియోగదారులకు భద్రత, రక్షణ మరియు సౌకర్యాన్ని అందిస్తాయి.

హిటాచీ లిఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మసాయా సకాకిబారా మాట్లాడుతూ “నోయిడా జిల్లా కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావటం మాకు గౌరవంగా ఉంది. మా అధిక-నాణ్యత ఉత్పత్తులు మరియు సేవలను అందించడం ద్వారా వినియోగదారులందరికీ మరియు నగర అభివృద్ధికి సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణాకు సహకరించడం మా లక్ష్యం. భారతదేశ సమాజం మరియు దాని ప్రజల శ్రేయస్సు కోసం మేము కట్టుబడి ఉంటాము. ”అని అన్నారు
హిటాచీ లిమిటెడ్ కార్పోరేట్ ఆఫీసర్, హిటాచీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ భరత్ కౌశల్ మాట్లాడుతూ, “తొమ్మిది దశాబ్దాలకు పైగా భారత్‌తో హిటాచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  (ఇకపై హిటాచీ ఇండియా ) అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యం అపూర్వమైన వేగంతో పురోగమిస్తోంది. భారతదేశం తమ ప్రజలకు సాధికారత కల్పించడమే కాకుండా, బిలియన్ల మందికి  జీవన నాణ్యతను పెంచడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారడానికి తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నది, “హిటాచీ లిఫ్ట్ ఇండియా భారతదేశ పరివర్తన ప్రయాణం లో ఒక సమగ్ర భాగస్వామి గా నిలిచింది మరియు CRC  గ్రూప్ దేశం యొక్క స్థిరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించింది. భారతదేశంలో పట్టణ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి మా నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించే CRC  గ్రూప్‌తో కలిసి పనిచేయటానికి మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం రెండు ప్రముఖ సంస్థల మధ్య వ్యూహాత్మక సమలేఖనానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, భారతదేశం అసమానమైన నిర్మాణ ప్రమాణాలను నెలకొల్పడానికి, స్థిరమైన సమాజాన్ని నిర్మించడానికై  ఒక పెద్ద ముందడుగు వేస్తుందని నిర్ధారించడంలో ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత యొక్క మా భాగస్వామ్య దృష్టిని కూడా నొక్కి చెబుతుంది. అర్బన్ మొబిలిటీ, ఎనర్జీ, ఐటి, చెల్లింపులు, ఇ-ఎడ్యుకేషన్ మరియు ఇ-హెల్త్‌కేర్‌తో సహా మా ఆదర్శప్రాయమైన ఇంకా విభిన్న పరిష్కారాలతో, హిటాచీ ఇండియా పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ప్రతిష్టాత్మకమైన మరియు ప్రగతిశీల దృక్పథాన్ని కలిగి ఉంది..” అని అన్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం ద్వారా,  ప్రీమియం మార్కెట్‌లో తమ కార్యకలాపాలను  పెంపొందించుకోవాలని మరియు భారతదేశంలో మరింతగా వ్యాపారాభివృద్ధికి కట్టుబడి ఉండాలని హిటాచీ లిఫ్ట్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

CRC ది ఫ్లాగ్‌షిప్ రూపురేఖలు

CRC ది ఫ్లాగ్‌షిప్ అనేది 223,000 చదరపు మీటర్ల ప్రాంగణం లో రూపుదిద్దుకుంటున్న వ్యాపార కేంద్రం, ఇందులో ప్రధానంగా 4 టవర్లు మరియు రిటైల్ భవనం ఉన్నాయి. ఇది కో-వర్కింగ్ స్పేస్, ఆడిటోరియం మరియు  గోల్ఫ్ కోర్స్ వంటి వివిధ సౌకర్యాలతో కార్యాలయ స్థలాలు, రిటైల్ దుకాణాలు మరియు ప్రీమియం సర్వీసెస్ అపార్ట్‌మెంట్‌లను అందిస్తుంది. ఈ  ప్రాజెక్ట్ దాని మొత్తం విస్తీర్ణంలో 20% కంటే ఎక్కువ పచ్చదనాన్ని కలిగి ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ప్రీ-సర్టిఫైడ్ ప్లాటినం రేటింగ్‌తో వాతావరణ అనుకూల మౌలిక సదుపాయాలను అందిస్తుంది.

నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకి దగ్గరగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ను చేరుకోవటానికి, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 35 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది మరియు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా నిలువనుంది.

CRC గ్రూప్ రూపురేఖలు

CRC గ్రూప్ భారతదేశంలోని NCR ప్రాంతంలో దాని ప్రీమియం ప్రాజెక్ట్‌ల ద్వారా  ప్రసిద్ధి చెందిన అత్యంత గౌరవనీయమైన డెవలపర్ గా గుర్తింపు పొందింది. ఈ గ్రూప్ అత్యుత్తమ భవనాలను పరిచయం చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ప్రమాణాలను మెరుగుపరచడానికి అంకితం చేయబడింది, అవి పరిపూర్ణత మరియు శ్రేష్ఠతతో నిండి ఉన్నాయి మరియు అవే ప్రమాణాలను కొనసాగిస్తాయి.

భారతదేశంలో హిటాచీ యొక్క ఎలివేటర్లు, ఎస్కలేటర్ల వ్యాపారం : ఎలివేటర్లు, ఎస్కలేటర్‌ల కోసం భారతదేశం యొక్క కొత్త ఇన్‌స్టాలేషన్ మార్కెట్ 2023 ఆర్థిక సంవత్సరంలో 67,000 యూనిట్లను మించిపోయింది, ఇది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది, ఇది సంవత్సరానికి 6-7% వృద్ధి చెందుతుందని అంచనా.
జనవరి 2008లో హిటాచీ లిఫ్ట్ ఇండియాను హిటాచీ ఏర్పాటుచేసింది. ఎలివేటర్ మరియు ఎస్కలేటర్ మార్కెట్‌లో పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుండి, ఇది అనేక ఆర్డర్‌లను పొందింది. విలాసవంతమైన నివాసాలు, హోటళ్లు, కార్యాలయాల కోసం హై-స్పీడ్ ఎలివేటర్‌లతో సహా దాని ఉత్పత్తులను ఇన్‌స్టాల్ చేయడం, నిర్వహించడంలో నిమగ్నమై ఉంది. హిటాచీ లిఫ్ట్ ఇండియా ప్రస్తుతం భారతదేశంలోని ఢిల్లీ NCR,  ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ వంటి అన్ని ప్రధాన నగరాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.