విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి: హెచ్ఎం కళాధర్

నవతెలంగాణ – పెద్దవంగర
నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుండే లక్ష్యాన్ని ఎంచుకుని, లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పినగాని కళాధర్ అన్నారు. గ్రామానికి చెందిన ముత్తినేని లక్ష్మణ్ తన తల్లిదండ్రులు విజయ-మోహన్ జ్ఞాపకార్థం పదో తరగతి విద్యార్థులకు శనివారం రూ.17 వేలు విలువ చేసే పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం అన్నారు. ప్రతీ విద్యార్థికి పదో తరగతి ఎంతో కీలకమని, దాతల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు బిక్షపతి, సోమన్న, సత్తయ్య, వెంకటేశ్వర్లు, రవి, కృష్ణమూర్తి, సుధాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.