బడీడు పిల్లలను బడికి పంపాలి: హెచ్ఎం నరేందర్ రెడ్డి

నవతెలంగాణ- పెద్దవంగర:
బడీడు పిల్లలను బడికి పంపాలని ఉప్పెరగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో సీఆర్పీ నిరంజన్ తో కలిసి బడిబయట పిల్లల గుర్తింపు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడీడు పిల్లలను తమ తల్లిదండ్రులు తప్పనిసరిగా బడిలో చేర్పించాలని అన్నారు. పిల్లలకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. వారు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న విద్యను, ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్న విధానాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో పస్తం నవ్య ను గురించి, ఆమె తండ్రి జంపులు తో కలిసి స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 6 తరగతిలో చేర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.