హెచ్‌ఎంఎ అగ్రో ఇండిస్టీస్‌కు రూ.1252 కోట్ల రెవెన్యూ

హెచ్‌ఎంఎ అగ్రో ఇండిస్టీస్‌కు రూ.1252 కోట్ల రెవెన్యూహైదరాబాద్‌ : ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెచ్‌ఎంఏ అగ్రో ఇండిస్టీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.1251.72 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.768 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. గడిచిన క్యూ3లో సంస్థ నికర లాభాలు 56.36 శాతం పెరిగి రూ.46.11 కోట్లుగా చోటు చేసుకుందని ఆ కంపెనీ పేర్కొంది. 2022-23 ఇదే క్యూలో రూ.29.49 కోట్ల లాభాలు నమోదు చేసింది.