మలేషియన్‌ సంస్థతో హెచ్‌ఎంఎ అగ్రో ఒప్పందం

హైదరాబాద్‌ : మలేషియా ప్రభుత్వానికి చెందిన సెలంగోర్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వ్యవసాయోత్పత్తుల కంపెనీ హెచ్‌ఎంఎ అగ్రో ఇండిస్టీస్‌ వెల్లడించింది. గేదె మాంసం పరిశ్రమ అభివృద్థికి సహాయపడే సహకార పరిశోధన ప్రాజెక్టుల కోసం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల సులభతరానికి వీలు కల్పించనుందని పేర్కొంది. మాంసం ప్రాసెసింగ్‌, సరఫరా గొలుసుల నాణ్యత, సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. ఇరు దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంతో ఈ ప్రక్రియలో రెండింటికి ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది.