రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో, ఆయన మార్గం సుగమమైంది. అదే సమయంలో ఉత్తర ప్రాంతం వియత్నాంను గెరిల్లా సైన్యంతో హస్తగతం చేసుకుని హోచిమిన్ ”డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం” గా ప్రకటించాడు. అయితే ఫ్రెంచ్ తన వలస పాలనను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సుమారు ఎనిమిదేండ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఉత్తర ప్రాంతం మీద మాత్రమే పూర్తి పట్టు సాధించగలిగాడు. అదే సమయంలో దక్షిణ వియత్నాంలో అమెరికా సహకారంతో నడుస్తున్న ప్రభుత్వంపై అక్కడ ప్రాంత ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దానికి హోచిమిన్ పూర్తి నాయకత్వం వహించి సహాయ సహకారలందించాడు. ఆయన స్ఫూర్తితో పనిచేసిన నేతలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి ”ఐక్య వియత్నాం” అనగా నేటి ఆధునిక వియత్నాం ఆవిర్భావాన్ని 1975లో సాధించారు.
చిన్న దేశమైన వియత్నాం, ప్రపంచ అగ్ర దేశాన్ని అమెరికాను గడగడలాడించిన వైనం సుమారు ఐదు దశాబ్దాలైనా నేటికీ అందరూ మరువలేకపోవడం వెనుక ఆ దేశ సైద్ధాంతిక నిబద్ధత, నాయకుని ప్రతిభాపాటవాలే.ఆ నాయకుడే హోచిమిన్. నేడు ఆయన జయంతి సందర్భంగా వియత్నం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుందాం. హోచిమిన్ అనగా ప్రకాశవంతమైనవాడు అని అర్థం. నిజంగా ఈరోజు వియత్నాం అన్ని విధాలుగా ప్రకాశిస్తూ ఉండటానికి కారణం హోచిమిన్ దార్శనికతే…1890, మే 19న జన్మించిన హోచిమిన్ వ్యక్తిగత జీవితంకంటే విప్లవ జీవితాన్నే కోరుకున్న యోధుడు. 16వ శతాబ్దంవరకూ ఒక వెలుగు వెలిగిన వియత్నాం దేశం, ఆతర్వాత కాలంలో అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత్వంతో కాలం వెలిబుచ్చుతూ, చివరికి 1894 నాటికి ఫ్రెంచ్ వలస ప్రాంతంగా మారింది. తదుపరి మూడు ముక్కలు చేసారు. వీరి పాలనలో విసుగు చెందిన వియత్నామీలు అసంతృప్తితో వ్యతిరేక ఉద్యమాలు ఫ్రెంచ్ పాలకులపై సంధించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం హోచిమిన్ ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో పాలు పంచుకున్నాడు. అప్పటికే లెనిన్ భావజాలం అందిపుచ్చుకున్న హోచిమిన్ తన సొంత దేశంలో ఫ్రెంచ్, జపాన్ పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించుకుని, తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో, ఆయన మార్గం సుగమమైంది. అదే సమయంలో ఉత్తర ప్రాంతం వియత్నాంను గెరిల్లా సైన్యంతో హస్తగతం చేసుకుని హోచిమిన్ ”డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం” గా ప్రకటించాడు. అయితే ఫ్రెంచ్ తన వలస పాలనను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సుమారు ఎనిమిదేండ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఉత్తర ప్రాంతం మీద మాత్రమే పూర్తి పట్టు సాధించగలిగాడు. అదే సమయంలో దక్షిణ వియత్నాంలో అమెరికా సహకారంతో నడుస్తున్న ప్రభుత్వంపై అక్కడ ప్రాంత ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దానికి హోచిమిన్ పూర్తి నాయకత్వం వహించి సహాయ సహకారలందించాడు. ఆయన స్ఫూర్తితో పనిచేసిన నేతలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి ”ఐక్య వియత్నాం” అనగా నేటి ఆధునిక వియత్నాం ఆవిర్భావాన్ని 1975లో సాధించారు. నేడు అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, సోషలిజానికి మారుపేరుగా ఈ అవనిలో నేడు ప్రకాశిస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా అడుగులు ముందుకు వేస్తుంది ఆ దేశం. కరోనా కాలంలో అమెరికాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలమై, ప్రాణనష్టంతోపాటు ఆర్థిక నష్టం చవిచూడగా, గణాంకాల ప్రకారం ఒక్క కరోనా మరణం సంభవించకుండా ప్రపంచపటంలో ప్రకాశించడానికి కారణం హోచిమిన్ అందించిన సోషలిస్టు సైద్ధాంతిక పాలన. ఆయన దృష్టిలో సోషలిజం అనగా ”ప్రజలతో మమేకం కావడం, ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడం”…. ఇటువంటి భరోసా ఇచ్చే దేశాలను చేతివేళ్లతో లెక్కించవచ్చు… అవికూడా ఈ సిద్ధాంతం ఆధారంగా నడిచే దేశాలే..
చదువుకున్న సమయం నుంచి మార్క్సిస్ట్ భావాలను మస్తిష్కంలో ముద్రించుకున్న హోచిమిన్ తన జీవితాంతం ఆ ఆశయం సాధనకై పరితపించాడు. ఏజెంట్ ఆరెంజ్ విషప్రయోగం చేస్తూ వియత్నాం పోరాట యోధులను ఏరిపారేద్దామనుకున్న అమెరికా సామ్రాజ్యవాద విస్తరణను, అమెరికాలో తన సొంత దేశంలోనే ఆనాటి ప్రభుత్వంపై విమర్శలు ఎదుర్కొనేటట్లు చేసాడు. చివరికి తన దేశాన్ని పరాయిపాలన నుంచి 1975లో పూర్తిగా విముక్తి కలిగించాడు. ఆ పోరాటం వెనుక హోచిమిన్ దార్శనికత ఉన్నదనేది వాస్తవం… అయితే ఈనాటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై, అభివృద్ధి చెందిన దేశాలు అనేకరకాల అణచివేతలను, ఆంక్షలు విధిస్తూ వారి చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్వతంత్ర దేశమైన పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి అన్ని విధాలా సహకరిస్తున్నది అమెరికాయేనని జగమెరిగిన సత్యం. ఉక్రెయిన్-రష్యా పోరులో కూడా అమెరికా నాటోతో కుట్ర చేస్తున్నది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు ఉద్యమాలు చేయాలి. అయితే ప్రపంచంలో మతసామరస్యాన్ని పెంపొందించడంతో పాటు ఆ దేశాల హక్కులు, సార్వభౌమాధికారాన్ని అందరూ గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కూడా అందరి ఎడల సమభావం కలిగి, తన స్వయం ప్రతిపత్తి కాపాడుకోవాలి. ఏ ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఏర్పడిందో ఆ ఆశయాలు సాధనలో ముందుకు సాగాలి. అందరి మన్ననలు పొందాలి. అమెరికా యుద్ధతంత్రాన్ని నిలువరించాలి. అమెరికాపై అలుపెరగని పోరాటం చేసిన విప్లవకారుడు హోచిమిన్. సోషలిస్టు భావాలతో తన జీవిత ప్రయాణం నేటి ప్రజానికానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
(నేడు హోచిమిన్ 134వ జయంతి)
– ఐ.ప్రసాదరావు 6305682733