– సెమీస్‌లో జపాన్‌పై 5-0తో గెలుపు
చెన్నై : హాకీ ఆసియా చాంపియన్‌షిప్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైలో జరిగిన సెమీఫైనల్లో జపాన్‌పై ఏకపక్ష విజయం సాధించిన భారత్.. టైటిల్ పోరుకు చేరుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 6-2తో గెలుపొందిన మలేషియా.. ఆదివారం టైటిల్ పోరులో ఆతిథ్య భారత్‌తో తలపడనుంది. ఇక సెమీస్‌లో జపాన్‌పై మనోళ్లు గోల్స్ వర్షం కురిపించారు. అర్షదీప్ (19), హర్మన్‌ప్రీత్ (పెనాల్టీ, 23), మన్‌ప్రీత్ (30), సుమిత్ (39), కార్తీ (51 నిమిషం) గోల్స్ నమోదు చేశారు. చివరి మూడు క్వార్టర్లలో జపాన్ డిఫెన్స్‌ను ఛేదించిన భారత్.. 5-0తో ఎదురులేని విజయం సాధించింది. దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేశ్ ఈ మ్యాచ్‌లో కెరీర్ 300వ మ్యాచ్ ఆడాడు.