దూపల్లి గ్రామంలో హోలీ సంబరాలు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో రాత్రి ప్రధాన కూడలి వద్ద కామ దాహం జరిపి అనంతరం ఉదయం మహిళలు తమ ఇండ్లను శుభ్రం చేసుకుని హోలీ పండుగ సందర్భంగా ఒకరినొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని రెంజల్, దూపల్లి, నీలా, బోర్గం, గ్రామాలలో సార్గమ్మ ఉన్నందున ఒకరోజు ముందుగానే హోలీ పండుగను జరుపుకోవడం విశేషం. రెంజల్, దూపల్లి గ్రామాలలో హోలీ పండుగను పురస్కరించుకొని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది.