కుటుంబ కలహాలతో హోంగార్డు ఆత్మహత్య

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 

కుటుంబ కలహాలతో హోంగార్డు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది . స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి దేవసాని మల్లారెడ్డి 53 మృతి చెందాడు. హుస్నాబాద్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న మల్లారెడ్డి భార్యతో గొడవపడ్డాడు. రాత్రి సమయంలో భార్య పిల్లలు నిద్రలో ఉండగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం లేచిన భార్య పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఏఎస్ఐ సురేందర్ రెడ్డి పంచనామా చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు.