– యుఈఎఫ్‌ఏతో మూడేండ్ల ఒప్పందం
ముంబయి: భారత ఉపఖండంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ‘హోమ్ ఆఫ్ ఫుట్‌బాల్’గా నిలువనుంది. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యుఈఎఫ్‌ఏ)తో సోనీ పిక్చర్స్ మీడియా హక్కుల ఒప్పందాన్ని మరో మూడేండ్లు పొడగించుకుంది. దీంతో చాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్, కాన్ఫరెన్స్ లీగ్ మీడియా హక్కులు సోనీ పిక్చర్స్ సొంతం అయ్యాయి. రానున్న మూడేండ్ల పాటు ఈ ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ లీగ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్, డిజిటల్ వేదికలపై సోనీ పిక్చర్స్ ప్రసారం చేయనుంది. ఈ మేరకు సోనీ పిక్చర్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ రాజేశ్ కౌల్ ఓ ప్రకటనలో తెలిపారు.