నవతెలంగాణ-భువనగిరి రూరల్ : భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామ సర్వేనెంబర్ 28 లో 76 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నాగేశ్వర చారి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ ఖాళీ స్థలం ఉండడం వలన భూమి అన్యాక్రాంతం అవుతుందని ఇట్టి భూమిలో రియాల్టర్లు మట్టిని త్రవ్వి తీసుకెళుతున్నారని వెంటనే రెవెన్యూ అధికారులు హద్దు బందులను ఏర్పాటు చేసి హనుమాపురం గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నివేషణ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హన్మాపురం లబ్ధిదారులు నాగపురి యాదగిరి, బండారు ప్రభాకర్, ఎం దుర్గారావు, రామగోని ప్రవీణ్, కుమార్ పి రవీందర్ రెడ్డి ,నరసింహ లు పాల్గొన్నారు.