సొంత ఊరు కన్న తల్లి వంటిది

– సొంత గ్రామానికి సేవ చేయడం ఒక వరం
–  ప్రభుత్వ పథకాలతో గ్రామాలు సస్యశ్యామలం
– ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో ఉజ్వల అభివృద్ధి
– రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
సొంత ఊరు కన్నతల్లి వంటిదని.. సొంత ఊరుకు సేవ చేయడం ఒక వరం అని రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసిన సందర్భంగా శుక్రవారం మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈ ఐదు సంవత్సరాల్లో నెరవేరింది అన్నారు. ఎన్నికలు సర్వ సాధారణం అని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో గ్రామాలు సస్యశ్యామలంగా రూపాతరం చెందాయి అని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాల్లో చరిత్రలో నిలిచే అభివృద్ధి పనులు జరిగిన్నట్లు వ్యాఖ్యానించారు. ప్రజా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందయన్నారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనం,క్రీడా ప్రగణాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీరు సరఫరా, హరితహారం తదితర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. పదవీకాలం ముగించుకుంటున్న సర్పంచులు రానున్న రోజుల్లో  కూడా ప్రజా సేవలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ గుగులోత్ కిషన్ నాయక్, ఎంపిఓ తుల రాంమ్మోహన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రెంటాల గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఐత రాంచందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.