డెంగ్యూకు గురై తగ్గిన వ్యక్తుల ఇంటి పరిసరాల సందర్శన

Home visits of dengue victims– డంపింగ్ యార్డ్ సందర్శన 
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ లో మహాలక్ష్మి దేవాలయం వద్ద గతంలో డెంగ్యూ వచ్చి పూర్తిగా తగ్గిపోయిన వ్యక్తుల ఇంటి పరిసరాలను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం డ్రై డే గ పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో మంచి నీరు నిలవ ఉంచరాదు అని, ఎప్పటికప్పుడు నీటి నిల్వ ఉంచే పాత్రలు శుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఇంటి పరిసర ప్రాంతాలలో దోమ నివారణ పిచికారి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆశా, అంగన్ వాడి కార్యకర్తలు జ్వరం సర్వే నిర్వహించారు. ఈ కార్య్రమంలో అడిషనల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శాదుల్ల, జవాన్ రాజేశ్వర్, ఆశా వర్కర్లు చంద్రకళ శోభ, ఎ ఎన్ ఎం సుశీల, ఆర్పీ సుమలత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల డంపింగ్ యార్డ్ సందర్శించారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ జవాన్లు తదితరులకు డంపింగ్ నిర్వహణ విషయంలో ఆదేశాలు ఇచ్చారు.