నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్లు

నవతెలంగాణ-మందమర్రి
దొరికిన బ్యాగ్‌ను బాధిత మహిళకు తిరిగి ఇచ్చి ఆటో డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. పాత బస్టాండ్‌ ఆటో స్టాండ్‌ వద్ద బుధవారం గుర్తు తెలియని ఎవరో పోగొట్టుకున్న ఒక హ్యాండ్‌ బ్యాగ్‌ అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లకి కన్పించింది. వెంటనే పోలీస్‌స్టేషన్‌ బ్లూ కోట్‌ సిబ్బంది గోపాల్‌కు సమాచారం అందించగా అక్కడకు వెళ్లి దొరికిన పర్సులో ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా అడ్రస్సు ద్వారా ఆ పర్సు గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ఆశ వర్కర్‌ సుజాతది అని తెలుసుకొని ఆమెకి అందచేశారు. అడుగడుగునా మోసాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా మందమర్రి ఆటో డ్రైవర్లు తమ నిజాయితీని చాటుకోవడంతో స్థానికులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కుమార్‌, రాజు, సంజీవ్‌, రమేష్‌, రాజేష్‌ పాల్గొన్నారు.