మండలంలోని వళ్లెంకుంట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వళ్లెంకుంట,కొండంపేట,చిన్నతూoడ్ల గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించి బదిలీపై వెళుతున్న కర్ణకంటి నరేష్, బంటు సమ్మరాజు,మారుపాక కుమారస్వామి లకు శనివారం శాలువాలతో ఆత్మీయ వీడ్కోలు సత్కారం చేసి,వారికి జ్ఞాపకార్థంగా వారి చిత్రపటాలు బహుమానంగా అందజేశారు.ఈ సందర్భంగా భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.