స్పెషల్ ఆఫీసర్ కు సన్మానం

నవతెలంగాణ – ఉప్పునుంతల
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల పదవీకాలం ముగిసినందున స్పెషల్ ఆఫీసర్లను కేటాయించిన ప్రభుత్వ యంత్రాంగం, గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపడుతూ..  ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ మండల వెటర్నరీ డాక్టర్  గెజిటెడ్ అధికారి కె.నరేందర్ నియమించడంతో శనివారం గ్రామానికి వచ్చిన సందర్భంగా పంచాయితీ కార్యదర్శి ఉమాశంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, గ్రామ నాయకులు గుద్దటి బాలరాజు, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ జిల్లా సభ్యులు ఉప్పరి బాలరాజు, గాడి శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు.