
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి, కార్యవర్గ సభ్యులు, రెడ్డి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.