బదిలీపై వెళ్లిన ఎంపీడీవో కు సన్మానం
భిక్కనూరు మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంపీడీవో గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన అనంతరావును మండల నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.