నవతెలంగాణ – జుక్కల్
పంచాయత్ రాజ్ శాఖలో నూతనంగా ఇటినలే బాద్యతలు చేపట్టిన డీఈ మధుబాబు ను జుక్కల్ మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్ ఆద్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతి నిధులు సన్మానించడం జర్గిందని పీఆర్ ఏఈ శ్రీనీవాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు ఎమ్మెలే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఆర్ డీఈ మదుబాబు, ఏఈ శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా డీఈ మధు బాబు మాట్లాడుతూ.. మండలంలోని పంచాయత్ రాజ్ శాఖను స్థానిక నాయకులతో కలిసి సమస్యలను వెంటనె పరిష్కారం చేస్తానని, అందరి సహయ సహకారాలు అందించినప్పుడే గ్రామాల ఆభివృద్ది సాద్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ కార్సక్రమంలో మండలంలోని కాంగ్రేస్ నాయకులు మాజీ ఎంపీపీ లక్ష్మన్ పటేల్, తదితరులు పాల్గోన్నారు.