
మండలంలోని ముచ్కూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన కొడిగెల శ్రావన్య రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపికవ్వడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, వీడిసి సభ్యులు సన్మానించారు. ఈనెల 23న జిల్లాస్థాయిలో జరిగిన గణిత ప్రతిభా పరీక్షలో ( ఇంగ్లీష్ మీడియం) శ్రావన్య రెండో ర్యాంక్ సాధించడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు . ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయుడు దేవరాజును అభినందించారు.