
ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 9.7 గ్రేడ్ పాయింట్లు సాధించిన మహమ్మద్ నబీల్ ను గోపాల్పేట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శేఖర్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాగిరెడ్డిపేట మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఇమామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్, గులాం హుస్సేన్, విక్రం, ఫారూఖ్ సాబ్, రాజు, అలిమ్ తదితరులు పాల్గొన్నారు.