ఘనంగా స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ – పెదవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకుని తండాలో నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, వారి విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈసందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్  మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని నటసింహ, ఎన్టీఆర్ నిబద్ధతకు  నిదర్శనం,దివంగత ముఖ్యమంత్రి తెలుగు జాతి అస్తిత్వ పతాక,తెలుగు నేల జవసత్వ ప్రతీక.ఒకే ఒక జీవితం రెండు తిరుగులేని చరిత్రలు కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఆద్వితీయ విజయానికి పత్రిక ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సపావత్ రంగా చౌవాన్, నరసింహ, సేవా, రమేష్, నవీన్, పాండు, రంగప్రభ, రంగసాయి,దస్రు, లింగయ్య, మోతిలాల్,నాగ, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.