శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రుణమాఫీ సంబరాల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ రైతులకు గొప్ప వరమని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు సింగిల్ విండో చైర్మన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.