యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామపంచాయతీ బుధవారం, త్వరలో పదవి కాలం పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్యను గ్రామస్తులు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు మల్లాపురం ఎంపీటీసీగా ప్రజాసేవ చేసిన కర్రే విజయ వీరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. పదవికే వన్నె తెచ్చే వ్యక్తిత్వం వారిదని కొనియాడారు. జీవితంలో మరెన్నో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఎంపిటిసి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం అని, ఎంపీటీసీ నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశానని అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామస్తులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.