నవతెలంగాణ – ఆర్మూర్
జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసీ కుమార్ నీ పూలమాల శాలువాతో రాంనగర్ రామాలయ కమిటీ అధ్యక్షులు కొక్కుల లింగం గౌరవ అధ్యక్షులు గంగమోహన్ చేతులమీదుగా బుధవారం రామాలయంలో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంగమోహన్ చక్రు మాట్లాడుతూ జాతీయ అవార్డు గ్రహీత మా రామ్ నగర్ కాలనీ వాసులు కావడం గర్వకారణమని ఇటువంటి సేవలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని ఎల్లవేళలా వారికి మా సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుద్దేటి రమేష్ గౌరవ సభ్యులు ఆనంద్ నర్సయ్య, లింబాగిరి స్వామీ, పోహర్ శేఖర్, గొనే సుదర్శన్ సుద్దాల శ్రీను, కోటగిరి గంగాధర్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.