నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల బదిలీపై వెళ్లిన అధికారులకు గ్రామ కార్యదర్శి ఘనంగా సన్మానం జరిపారు. రెంజల్ ఎంపీఓ గౌస్ సోద్దీన్, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి, ఆఫీస్ సబార్డినేట్ సురేష్, గ్రామ కార్యదర్శిలు రోజా, గౌతమి, రెంజల్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ బి వెంకటగిరి, బదిలీపై వెళ్లగా వారిని ఘనంగా శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. గతంలో రెంజల్ ఎంపీడీవో గా పనిచేసి వెళ్లిన శంకర్ రంగారెడ్డి జిల్లాకు పొదిలి కాగా ఆయనకు సైతం వారు ఘనంగా సన్మానం జరిపారు. దీంతోపాటు నూతన విచ్చేసిన ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, సూపర్డెంట్ శ్రీనివాస్, ఎంపీ ఓ రఫీ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ అన్వర్ హైమద్, జూనియర్ అసిస్టెంట్ సురేష్, గ్రామ కార్యదర్శి షీభ, లను కూడా సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ కార్యదర్శిలు రాజేందర్ రావు, రాఘవేందర్ గౌడ్, జి శ్రీకాంత్, నవీన్, సునీల్ యాదవ్, సిహెచ్ సాయిలు, బి. రాణి, రజిని, శరత్ చంద్ర, రాజు, సాయిబాబా, బి శివ కృష్ణ, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.