
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ కు మద్నూర్ మండలంలోని కరగ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాధవరావు పాటిల్ శనివారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాధవరావు పాటిల్ మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న శ్రీకాంత్ సార్ తో మార్కెట్ కమిటీ అభివృద్ధి గాని వ్యవసాయ రైతులకు గాని అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు రామచందర్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.