మద్నూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో నాలుగున్నర సంవత్సరాలు మండల ప్రజలకు రెవెన్యూ కార్యాలయంలో సేవలందించి బదిలీపై వెళ్తున్న నక్కవార్ చంద్రశేఖర్ గారికి మద్నూర్ మండల తహసీల్దార్ ఏం డి ముజీబ్, కార్యాలయ సిబ్బంది సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల సరిహద్దు మండలమైన మద్నూర్ ను ఇక్కడి ప్రజల వివిధ భాషలు, వివిధ సంస్కృతికి నిలయంగా ఉన్నటువంటి మండలంలో అన్ని భాషలను అర్థం చేసుకొని ప్రజలందరికీ సేవలందించి కార్యాలయంకు వచ్చిన వారికి మంచి స్పందన తో సమాధానం ఇస్తూ వాటి సమస్య పరిష్కారానికి ఎల్లవేళలా సేవలందించిన చంద్రశేఖర్ ఇక్కడి ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. ఇదే విధంగా బదిలీపై వెళ్తున్నా మండలం లో కూడా ప్రజల సమస్యల పట్ల మంచి స్పందనతో పేరు సంపాదించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్దవార్ శంకర్, జూనియర్ అసిస్టెంట్ లు రవి కుమార్, బాలరాజు, కావేరి, రికార్డర్ అసిస్టెంట్ లు హన్మాండ్లు, రాజేశ్వర్, నర్సింలు, కంప్యూటర్ ఆపరేటర్ లు సతీష్, ముస్తఫా మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.