నవతెలంగాణ – ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ కు 1996లో ఓయూ గౌరవ డాక్టర్ ను ప్రధానం చేసింది. దివంగత మాజీ వీసి ప్రొఫెసర్ రామకిష్టయ్య హయాంలో యూనివర్సిటీ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన స్నాతకోత్సవంలో 46వ, గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రామకృష్ణయ్య గౌరవ డాక్టరేట్ ను అందించారు. అర్థశాస్త్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన కృషిని గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందజేసింది. దేశానికి ఎన్నో ఆర్ధిక సేవాలు చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని,అలాంటి వ్యక్తి ని కోల్పోవడం దేశానికి తీరని లోటు అన్నారు.ఆలాంటి గొప్ప వ్యక్తి కి ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో ఇచ్చి సత్కరించటాన్ని వీసీ ప్రొ. కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయిన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తు,అయిన మృతి కి నివాళులు అర్పించారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరలని కోరారు.