ఆరాధ్య ఫౌండేషన్ ఛైర్మన్ కు గౌరవ డాక్టరేట్

నవతెలంగాణ  – తుంగతుర్తి
మలిదశ తెలంగాణ ఉద్యమకారిణి, సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి, కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన సామాజిక సేవకురాలు,ని యోజకవర్గంలో సమస్యలు ఎక్కడుంటే అక్కడ తమ సేవలు అందించిన సహృదయురాలు , మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తూ, భావితరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ చేసిన అనేక ప్రజాసేవా కార్యక్రమాలను గుర్తించి శనివారం బేగంపేట మారి గోల్డ్ హోటల్ లో  న్యూ మాంక్స్ కుంగ్  ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిల్ జనరల్ ఆఫ్ టర్కియల్మాన్ “ఓర్హాన్ ఓఖాన్” చేతుల మీదుగా “యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ” వారు “తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ కి” గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అలాగే సామాజిక సేవ చేయడంలో తన బాధ్యతను మరింత పెంచిందని వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు.ఆమెకు ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందించడం పట్ల ఆరాధ్య ఫౌండేషన్ మండల అధ్యక్షులు అంబటి రాములు,తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు గుగులోత్ జయపాల్ నాయక్,వాసం అభిలాష్, ప్రసన్న కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.