నవతెలంగాణ ఆర్మూర్: పట్టణ..పద్మశాలి సంఘం 5 వ తర్ప అధ్యక్షులు సైబా సుధాకర్ ,వారి కమిటీ ఆధ్వర్యంలో ఇటీవలే కళా రంగంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో అవార్డు అందుకున్న చౌక లింగం , జాతీయస్థాయిలో సేవారంగం ద్వారా భారత సేవారత్న పురస్కారం అందుకున్న పట్వారి తులసి కుమార్ ను సన్మానించి, జ్ఞాపికను బుధవారం అందజేసినారు. ,ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ మన పద్మశాలి సంఘం యొక్క గొప్పతనాన్ని చాటినందుకు చాలా గర్వకారణం అని, వారి సేవలు ఇలానే ఉండాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొండ గంగాధర్, కోశాధికారి క్యాతం లక్ష్మణ్, నరేందర్, సుధాకర్, రమేష్ గోపికృష్ణ, శేఖర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.