తెలంగాణ యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ (టైజా) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పులే జాతీయ అవార్డు గ్రహీత కొడారి వెంకటేష్ యాదవ్ ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ భారత దేశంలో 27 రాష్ట్రాల్లో విస్తరించిన బహుజన సాహిత్య అకాడమీ, కొడారి వెంకటేష్ సేవలను గుర్తించి మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ జాతీయ అవార్డును అందజేయడం చాలా అభినందనీయం అని అన్నారు. కొడారి వెంకటేష్ కు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పసుల నర్సింహులు యాదవ్ , జిల్లా కమిటీ సభ్యులు ఎల్లముల వెంకటేష్ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా సెక్రెటరీ బింగి జంగయ్య యాదవ్, నాయకులు ప్రవీణ్ లు పాల్గొన్నారు.