యాదవుల ఆధ్వర్యంలో వెంకటేష్ యాదవ్ కు సన్మానం..

Honored to Venkatesh Yadav under the leadership of Yadavs..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ అవార్డు గ్రహీత కొడారి వెంకటేష్ యాదవ్ ను మంగళవారం భువనగిరి లో ఘనంగా  సన్మానించారు. ఈ సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ యాదవ ముద్దుబిడ్డ కొడారి వెంకటేష్ యాదవ్ కు మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ అవార్డు రావడం జిల్లా యాదవ కులస్తులందరికీ గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల యాదమల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కొడారి వెంకటేష్, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యాదవ జాతి చైతన్యానికి, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల యాదమల్లయ్య యాదవ్, జిల్లా నాయకులు తోట కూర కృష్ణ యాదవ్,పాక జహంగీర్ యాదవ్,పసుల నర్సింహ యాదవ్, ప్రవీణ్ లు పాల్గొన్నారు.