వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో సన్మానం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని సంగెం గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఐదు సంవత్సరాల పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసినందుకుగాను వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల్ నరసింహ ఆధ్వర్యంలో శాలువాలతో గురువారం ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం యూత్ సభ్యులు సర్పంచును గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీకాలంలో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, వైకుంఠధామాలు, వివిధ రకాలైన అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని, గ్రామ ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడు తనపై ఉంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కీసరి రాంరెడ్డి, ఉప సర్పంచ్ చింతాకుల వినోద నాగరాజు, సెక్రటరీ విజయ్ కాంత్, వార్డ్ మెంబర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.