బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

Honoring teachers who are going on transferనవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణములోని వడ్డెర కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేసి వృత్తిలో భాగంగా వేరే ప్రాంతానికి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, సంధ్య రాణి, భాగ్యలక్ష్మి లకు వారు చేసిన సేవలకు గుర్తింపు గా శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుమ్మల లక్ష్మణ్  ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమములో ఉపాధ్యాయులను శాలువా పూల మాలలతో జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్  హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సంగీతా ఖాందేష్  మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్దంగా, శ్రద్దగా చదువుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు తుమ్మల లక్ష్మణ్ , కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం  పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.