బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

Honoring teachers who have gone on transferనవతెలంగాణ – బొమ్మలరామారం  

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సాధారణమని మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల జ్యోతి అన్నారు. మండలంలోని మర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొన్ని రోజులుగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్ చారి, చంద్రమౌళి, విజయలక్ష్మి, బాలసుబ్రమణ్యం, సైదులు,యామిని అబ్దుల్ ముబీన్ లకు శనివారం పాఠశాలలో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా మర్యాల పాఠశాలకు వివిధ పాఠశాలల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు సిద్ధులు, రాజు, శోభ, నాగజ్యోతి, శ్రీధర్, స్వరూపం, రాణి, సుష్మ, సుజాత, శ్రీదేవి, గోపాల్ లకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.