నవతెలంగాణ-శంకర్‌పల్లి
మండలంలోని కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈ మధ్య జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో కొండకల్ పాఠశాల నుంచి రామకష్ణారావు, రాములు, వెంకటేశం, సుజాత, అరుంధతి, ఐదు మంది ఉపాధ్యాయులు ఇతర పాఠశాలకు బదిలీపై వెళ్లారు. అదేవిధంగా గత నెల 30న యాదమ్మ (సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు) పదవీ విరమణ పొందారు. వారందరికీ సోమవారం కొండకల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు డి.జీవనజ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి తమ ఉద్యోగ జీవితంలో బదిలీ అనేది సహజమని అదేవిధంగా పదవీ విరమణ కూడా తప్పదని అన్నారు. ఉపాధ్యాయులు ఎక్కడ పని చేసిన విద్యార్థులను వద్ది లోనికి తీసుకురావడమే వారి లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి, అంజిరెడ్డి, జగదాంబ, సంధ్యశ్రీ, కుసుమకుమారి, శ్రీనివాస్, జంగయ్య, శ్రీను, హరికష్ణ,రాధ, యాదయ్య, ఇందిరాబాయి, స్వప్న, పూర్వ విద్యార్థులు, పాల్గొన్నారు.