– సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని సమాచారం
నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలో కొందరి పోకిరీ చేష్టలు రోజురోజుకీ హద్దుమీరుతున్నాయి. నకిలీ తుపాకీ(లైటర్ గన్)తో పలువురిని భయపెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు ఉదాహరణకు ఫిబ్రవరి 3 వ తేదీ అనగా శనివారం రాత్రి అయిదో టౌన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ముగ్గురు యువకులు కేంద్రీయ విద్యాలయం సమీపంలో చీకట్లో నకిలీ తుపాకీతో శబ్ధం చేస్తూ హల్చల్ చేశారు. ఈ ప్రాంతంలో ఉండే మినీ ట్యాంక్ బండ్ కు మహిళలు, యువతతో పాటు ఫ్యామిలీస్ నిత్యం సాయంత్రం వేళ సేద తీరేందుకు వస్తుంటారు. శనివారం రాత్రి నకిలీ గన్ తో ముగ్గురు యువకులు శభ్ధం చేయడంతో దారి వెంట వచ్చి వెళ్లేవారు భయానికి లోనయ్యారు. చివరకు మహిళా హోంగార్డు శబ్ధాన్ని గుర్తించి స్థానికుల సాయంతో ముగ్గురిని పట్టుకుంది. అనంతరం అయిదో టౌన్ లో అప్పగించగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గంజాయి మత్తులో యువత వీటిని అడ్డుపెట్టుకొని పలువురిని భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో నేరాల వైపు మళ్లుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇకనైనా ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ల విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉండగా ఇలాంటి ఘటనలు జరగడం అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్సైలు సీఐలు కేసుల విషయంలో గతంలో అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల కు సంబంధించిన వారి పెత్తనం కొనసాగించడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధనలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని ప్రజలతోపాటు పోలీసు వర్గాలు కూడా తెలుపుతున్నాయి.