జనవరిలో షూటింగ్‌ షురూ..

హీరో విజయ్ తనయుడు జాసన్‌ సంజయ్ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా లైకా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. తాజాగా ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ హెడ్‌ జికెఎం తమిళ్‌ కుమరన్‌ మాట్లాడుతూ ‘మా సంస్థ ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్‌ సంజరును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఆయన తెరకెక్కించబోతున్న కథ, ఆయన నెరేషన్‌ విన్నప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా పాన్‌-ఇండియా దష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్‌ ఉంది. మనం ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనటాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ దాని కోసం మనం ఏం వెచ్చిస్తామనేదే ప్రధాన పాయింట్‌గా సినిమా ఉంటుంది. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సరికొత్త కాంబో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందని మేం భావిస్తున్నాం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరి నుంచి స్టార్ట్‌ చేయబోతున్నాం’ అని తెలిపారు.