మాకు వయసు మీరిపోతుంది. 2008లో డీఎస్సీ రాశాము. 15ఏండ్లు కావస్తోంది. ఇంకెన్నడు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల భర్తీ చేపడతారు.సుప్రీంకోర్టు సైతం డీఎస్సీ రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకొర్టు తీర్పు చెప్పింది. అయినా తెలంగాణ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఉన్నత చదువులు చదివి కుటుంబాలను పోషిస్తారనుకున్న అమ్మ నాన్నల ఆశలు ఆడిఆశలుగా మారుతున్నాయని డీఎస్సీ రాసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– మాకు న్యాయం చేయండి
– ఉద్యోగం కోసం 15 ఏండ్లుగా నిరీక్షణ
– కోర్టు తీర్పు బేఖాతర్
– వయసు మీరుతున్న కనికరం చూపని పాలకులు
– అప్పుల్లో కూరుకుపోతున్న 2008 డీఎస్సీ అభ్యర్థులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉపాధ్యాయ ఉద్యోగం అంటేనే సమాజంలో ఒక గౌరవం. ఉన్నత విలువులను విద్యార్థులకు తెలియ జేస్తూ… వారిని ఉన్నత శిఖరాలకు ఎదిగించే ఉపాధ్యాయ అభ్యర్థులకే కష్టాలోచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2008న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బీఈడీ, డీఈడీి చదివిన ఇద్దరూ… అర్హులే. ముఖ్యంగా టీటీసీ అభ్యర్థులకు 30 శాతం ఉద్యో గాలను కేటాయించాలన్న ఉద్ధేశ్యంతో జీవో నెంబరు 28ని తీసుకొచ్చింది. నోటీపీకేషన్ తర్వాత వచ్చిన జీవో కోసం పరీక్ష తేదీని పెంచారు. పరీక్షా పలితాలు సైతం విడదల చేశారు. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసొకొచ్చిన జీవోలు చెల్లవని ప్రభుత్వానికి తెలిసినా… జీవో తీసుక రావడంతో బీఈడీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 డిసెంబరు 6న నోటీపీకేషన్ ప్రకారం ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ నిర్వహించారు.టీటీసీ అభ్యర్థులు జీవో నెంబరు అమలు విషయంలో సవాల్ చేస్తూ… న్యాయ స్థానానికి వెల్లారు. ప్రభుత్వాన్ని పరలించమని కోర్టు సూచన చేసింది. కోర్టుల సూచనలు సలహాలు ఏవీ పట్టని కొంత మంది టీటీసీ అభ్యర్థులు కౌన్సిలింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. దీంతో కౌన్సిలింగ్‌ను ఆపాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. బీఈడీ అభ్యర్థులు సైతం 28 జీవో పట్ల జరుగుతున్న అన్యాయంపై కోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో త్రిసభ్య కమిటీ అర్థంతరంగా ఇచ్చిన జీవో నెంబరు 28ని నిలుపుదల చేస్తూ… స్టే ఇచ్చింది. కోర్టుల తీర్పులకు లోబడి నియామకాలు జరపాల్సి ఉంది. 30 శాతం టీటీసి వారికి 70 శాతంలో బిఇడి, టీటిసి వారికి అవకాశం ఉంటుంది. 27 సెప్టెంబరు 27 ఇచ్చిన తీర్పు ప్రకారం టీటీసి వారికి 30 శాతం కెటాయించింది. ఇంకా 1817 పోస్టులు మిగిలాయి. వీటిని బీఈడీ వారి చేత భర్తీ చేయాల్సింది. అయితే బ్యాక్‌లాక్ పోస్టులు, ఎజెన్సీ పోస్టుల విషయంలో ఎటువంటి నిర్ణయం లేదన్న కారణంతో ఈ పోస్టులను భర్తీ చేయడం లేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఉన్న పోస్టుల కంటే అభ్యర్థులు తక్కువే ఉన్నారు. తెలంగాణలో మొత్తం 1200 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులున్నారు. ఉమ్మడి జిల్లాలో 150 ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలోనే వైఫల్యం ఉందని పలువురు ఉపాధ్యాయ నాయకులు విమర్శించారు.
2008 డీఎస్సీ అభ్యర్థులపై వివక్ష
అప్పులు చేసి ఉన్నత చదువులు చదివాను. ఉద్యోగం వస్తోం దని కలలు కన్నాను. అయితే చదువుకోసం తెచ్చిన అప్పులు పెరుగుతున్నాయి. తప్ప ఉద్యోగం రావడం లేదు.ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న రాష్ట్ర నాయకులు 2008 డీఎస్సీ అభ్యర్థులపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదు.
రమేష్, 2008 డీఎస్సీ అభ్యర్థి
కుటుంబాలు భారం అవుతున్నాయి
మేము డీఎస్సీ రాసి 15 ఏండ్లు కావస్తోంది. ఎప్పటికైనా ఉద్యోగం వస్తోందని ఆశ పడ్డాం. ఆశలు సన్నగిల్లుతున్నాయి.మాకు వయసు పెరిగిపోతుంది. కుటుంబ పోషణ భారంగా మారింది. కోర్టులు చెప్పిన తీర్పును అమలు చేసి మాకు న్యాయం చేయాలి. లేనిచో మాకు ఆత్మ హత్యలే శరణ్యం.
– నరేష్ ,2008 డీఎస్సీ అభ్యర్థి, తెలకపల్లి