– కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలకు అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ -తాడ్వాయి
ఏజెన్సీ ప్రాంతాలలో ఆశా వర్కర్లు వైద్య సేవలు అందించడంలో ముందుండాలని కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్, సెకండ్ మెడికల్ ఆఫీసర్ గౌతమ్ లు అన్నారు. సోమవారం మండలంలోని కోడిశెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ లకు ఆశా డే కార్యక్రమం నిర్వహించారు. ఆశావర్కర్ల లకు వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకత, వాటిని ఏయే నెలల్లో, ఏ డోసులు వేయ్యాలి, అవి ఏ వ్యాధులకు ఇస్తారు, అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులకు పిల్లలకు ఎనిమీయా(రక్తహీనత) వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఆశాలు గర్భిణీ, బాలింతల దర్శనాలు వారికిచ్చే పౌష్టికాహారం వ్యక్తిగత శుభ్రత, మరియు టీకాల గురించి అవగాహన ఇవ్వాలని, హై రిస్క్ గర్భిణులకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు. బిపి, షుగర్ ఉన్నవారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఆసుపత్రిలో సుఖ ప్రసవం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన మండలానికి భరోసా ఇవ్వడంలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి విజయ్, ఎం ఎల్ హెచ్ పి శ్రావణి, సూపర్వైజర్ పద్మ, వర్మసిస్ట్ మోకాల స్వామి, ల్యాబ్ టెక్నీషియన్ కోటే శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.